చిన్నారి ధైర్యాన్ని అభినందించిన చంద్రబాబు...

చిన్నారి ధైర్యాన్ని అభినందించిన చంద్రబాబు...
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు వెలివేయడంతో కోడూరి పుష్ప అనే అమ్మాయి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు...

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు వెలివేయడంతో కోడూరి పుష్ప అనే అమ్మాయి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపైన స్పందించిన జగన్ వెంటనే ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు.

అయితే అ పాప దైర్యానికి టీడీపీ అధినేత మరియు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అభినందించారు . కల్లాకపటం తెలియని పసి వయసులో ఒక చిన్నారి ''వెలివేయడం'' అనే అనాగరిక దౌర్జన్యాన్ని ఎదుర్కోవాల్సి రావడం సభ్య సమాజానికే సిగ్గుచేటు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం చిన్నారి 'కోడేరు పుష్ప' విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. అని ట్విట్టర్ లో పేర్కొన్నారు .


అంతే కాకుండా తమ ఊళ్లో దుర్భర పరిస్థితులను లేఖ ద్వారా వెల్లడించి, న్యాయం కోరిన చిన్నారి ధైర్యాన్ని అభినందిస్తున్నాను. తన తండ్రి, తాతలకు ప్రాణాపాయం ఉందనే భయాన్నిఆ చిన్నారిలో తొలగించాలి. చిన్నారి పుష్ప నిర్భీతిగా, స్వేఛ్ఛగా చదువుకోవాలని, రేపటి పౌరురాలిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. అని చంద్రబాబు వాఖ్యానించారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories