Chandrababu Arrest: అర్దరాత్రి బాబు హల్‌చల్

Chandrababu Arrest: అర్దరాత్రి బాబు హల్‌చల్
x
అర్దరాత్రి బాబు హల్‌చల్
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి మంగళగిరి వీదుల్లో పాదయాత్ర చేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి మంగళగిరి వీదుల్లో పాదయాత్ర చేశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అందర్ని పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. రాష్ర్టంలో నిర్భందం అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులకు సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా మందడం వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబుతో సహా పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌ తీసుకెళ్లే క్రమంలో చంద్రబాబు వాహనాన్ని దారి మళ్లించారు. కరకట్ట వైపు కాకుండా వెంకటాయపాలెం వైపు మళ్లించారు. మందడం, కృష్ణాయపాలెం నుంచి ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వైపు తీసుకెళ్లారు. మంగళగిరిలో చంద్రబాబు తరలిస్తున్న వాహనాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఆపారు. రహదారిపై భైఠాయించి ఆందోళన చేశారు. డొంకరోడ్డులో వాహనాన్ని తిప్పడంపై తీవ్ర ఆగ్రహం చేశారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఓ చీకటి రోజని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు అమరావతిని చంపేయాలనే గోరమైన తప్పిదానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ వయసులో చిన్న వాడైనా దణ్ణం పెట్టి అడిగా. అయినా కనికరం చూపించలేదు. మానవ హక్కులు ఉల్లంఘించి మరీ దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. అరెస్టులు, లాఠీ ఛార్జులు హేయమైన చర్య అని మండిపడ్డారు. అమరావతి పోరాటం ఇక్కటితో ఆగదన్నారు ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడం కోసం ఎక్కడిదాకైనా పోరాడుతామని చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబును ఆయన నివాసం దగ్గర వదిలి వెళ్లారు పోలీసులు. పలువురు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు చంద్రబాబ ఇంటికి చేరుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories