ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిషోర్‌కు ఊరట..

ఐఆర్‌ఎస్‌ అధికారి కృష్ణకిషోర్‌కు ఊరట..
x
ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కృష్ణకిషోర్ క్యాట్‌ను ఆశ్రయించా. దీంతో క్యాట్ అప్పీళ్లను పరిశీలించి జగన్ సర్కార్ కిషోర్‌ను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది. దాంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం జాస్తి కృష్ణకిషోర్‌కు ఊరట లభించింది.

అయితే కృష్ణ కిశోర్‌ ఈడీబీ సీఈవోగా విధులు నిర్వహిస్తున్న సమయంలో నిధులను దుర్వినియోగం చేసారని, దాంతో పాటు ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న ఆరోపణలు ఈ‍యన మీద వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ ఆరోపణలపై పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తెప్పించి పరిశీలించింది. నివేదికలను పరిశీలించిన మీదట కృష్ణ కిషోర్‌పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాదు ఈ విచారణనను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తయ్యేవరకు అమరావతి విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం కృష్ణ కుమార్ ను ఆదేశించింది.

ఈడీబీ స్పెషల్‌ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ తులసిరాణి ఆదివారం రాత్రి కృష్ణకిషోర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై సెక్షన్ 188,403, 409, 120 బీ కింద కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి 11 గంటలకు సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ను కోర్టుకు పంపారు. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. దాంతో కోర్టు కృష్ణ కిశోర్ సస్పెన్షన్ ఉత్తర్వులపై ఈ నెల 24 వరకు స్టే విధించింది.

కృష్ణ కిశోర్‌ ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం సహా ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అనంతరం కృష్ణ కిషోర్‌పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీని ఆదేశించింది.. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సూచించింది. విచారణ పూర్తయ్యేవరకు అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిషోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

టీడీపీ ప్రభుత్వం హయాంలో కృష్ణ కిషోర్‌ ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పని చేశారు. సీఎం చైర్మన్‌గా ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) పని చేస్తుంది. ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిషోర్ ను మూడేళ్ల పదవీ కాలానికి చంద్రబాబు ఆయన్నునియమించారు. 1990 బ్యాచ్‌కు చెందిన కృష్ణ కిశోర్.. అంతకు ముందు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు వద్ద సెక్రటరీగా పని చేశారు. ఐఆర్ఎస్ కావడానికి ముందు చార్టర్డ్ అకౌంటెంట్ అయిన కృష్ణ కిశోర్ హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పని చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories