కరోనా విషయాన్ని దాచిపెట్టారు.. ఏపీలో ముగ్గురిపై కేసు నమోదు

కరోనా విషయాన్ని దాచిపెట్టారు.. ఏపీలో ముగ్గురిపై కేసు నమోదు
x
Representational Image
Highlights

కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసినా.. బయటకు చెప్పనందుకు తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురిపై కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌ అస్మి చెప్పిన...

కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసినా.. బయటకు చెప్పనందుకు తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురిపై కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌ అస్మి చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖపట్టణం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని కత్తిపూడికి ఓ వ్యక్తి వచ్చాడు. తనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన అతడు స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు.

ఇది తెలుసుకున్న అన్నవరం పోలీసులు, వ్యాధి వుందని తెలిసినా బయటపెట్టనందుకు బాధితుడి మామ, అతడికి చికిత్స చేసిన ఆర్‌ఎంపీ, రక్త పరీక్షలు చేసిన ల్యాబ్ టెక్నీషియన్‌పై కేసులు నమోదు చేశారు. మరోవైపు, బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖకు తరలించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నప్పుడు తెలియజేయకపోతే ఆ కుటుంబ సభ్యులతో పాటు వైద్యం చేసిన వారిపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎప్పీ నయీమ్‌ తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories