లెక్కతప్పిన వాతావరణ శాఖ..

లెక్కతప్పిన వాతావరణ శాఖ..
x
Highlights

ఖచ్చితమైన అంచానలు అన్నారు. తమ లెక్కలు తప్పవన్నారు. సాగుకు ఏర్పాట్లు చేసుకోమంటూ ప్రకటనలు ఇచ్చారు. కాని రోజులు పూర్తయ్యి .. వారాలు గడుస్తున్నాయి. ...

ఖచ్చితమైన అంచానలు అన్నారు. తమ లెక్కలు తప్పవన్నారు. సాగుకు ఏర్పాట్లు చేసుకోమంటూ ప్రకటనలు ఇచ్చారు. కాని రోజులు పూర్తయ్యి .. వారాలు గడుస్తున్నాయి. అయినా చినుకు జాడ కాన రావడం లేదు. పక్షం గడిచినా అదిగో ..ఇదిగో అనడం తప్ప .. నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా ... రుతపవనాల గమనాన్ని అంచనా వేయడంలో భారత వాతావరణశాఖతో పాటు ప్రయివేటు సంస్ధలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఈ ఏడాది అనుకున్న సమయానికి నైరుతి రుతుపవనాలు వస్తాయంటూ ఐఎండీతో పాటు సైమెట్‌ వంటి సంస్ధలు ప్రకటించాయి. ఏటాలాగే ఈ సారి కూడా ఆయా సంస్ధల అంచనాలు తప్పాయి. ఇప్పటి వరకు కేరళ నుంచి కర్నాటక వరకు ఎక్కడా చినుకు కరువలేదు. గడచిన 12 సంవత్సరాల్లో ఇంత ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఎప్పుడూ రాలేదంటున్నారు.

రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో తమిళనాడుతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, దక్షిణ కర్నాటకకు ... ఈ నెల 25 నాటికి దక్షిణ భారత దేశంతో పాటు మహారాష్ట్రకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నమాట. నైరుతి రుతుపవనాలు ఆలస్యం అవుతూ ఉండటంతో తమిళనాడు, కర్నాటకల్లో తీవ్రమైన తాగు నీటి కటకట ఏర్పడింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రజలు తాగు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నైరుతి రుతుపవనాలపైనే అటు రైతులు, ఇటు ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories