ప్రపంచ బ్యాంకు రుణాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ప్రపంచ బ్యాంకు రుణాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
x
Highlights

వరల్డ్‌ బ్యాంక్‌ రుణం రద్దుపై ఏపీ అసెంబ్లీలో హైవోల్టేజ్‌ వార్ జరిగింది. అమరావతికి రుణం ఉపసంహరించుకోవడానికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమన్న ఆర్ధికమంత్రి...

వరల్డ్‌ బ్యాంక్‌ రుణం రద్దుపై ఏపీ అసెంబ్లీలో హైవోల్టేజ్‌ వార్ జరిగింది. అమరావతికి రుణం ఉపసంహరించుకోవడానికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమన్న ఆర్ధికమంత్రి బుగ్గన ఫుల్‌ డిటైల్స్‌‌తో ప్రకటన చేశారు. బుగ్గన అసత్యాలు చెప్పారంటూ విరుచుకుపడ్డ చంద్రబాబు అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న దుర్మార్గులంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది.

ప్రపంచ బ్యాంకు రుణాలపై ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. అమరావతికి రుణంపై వరల్డ్‌ బ్యాంక్ వెనక్కి తగ్గడంపై ఫుల్‌ డిటైల్స్‌‌ను సభ ముందుంచారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రపంచ బ్యాంకు రుణం కోసం అప్పటి ప్రభుత్వం దరఖాస్తు చేసిందన్న బుగ్గన ఆ అప్లికేషన్‌‌ను కేంద్రం ద్వారా ఫార్వాడ్‌ చేయించడానికి 9నెలల టైమ్ తీసుకుందని తేదీలు, లెక్కలతో సహా వివరించారు. అయితే రాజధాని రైతులు పెద్దసంఖ్యలో వరల్డ్‌ బ్యాంకు‌కు ఫిర్యాదు చేయడంతో పరిశీలన కోసం కమిటీని అపాయింట్ చేసిందని, ఆ తర్వాత వరల్డ్‌ బ్యాంక్ కమిటీ అమరావతిలో పర్యటించి అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ జరిపితే, అసలు నిజాలు బయటికొస్తాయంటూ నివేదికలు ఇచ్చిందని వివరించారు.

దాంతో క్షేత్రస్థాయిలో మరింత పరిశీలన కోసం వరల్డ్‌ బ్యాంక్‌ కేంద్రాన్ని ఆశ్రయించిందని, అయితే ప్రపంచ బ్యాంకు ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం చెప్పిన కేంద్రం రాష్ట్ర అభిప్రాయం కోరిందని తెలిపారు. అయితే తామిప్పుడే అధికారంలోకి వచ్చినందున జులై ఎండింగ్ వరకు టైమ్ కావాలని కోరామని, కానీ జులై 15లోపే అభిప్రాయం చెప్పాలని కేంద్రం ఒత్తిడి చేయడంతో, ఏది కరెక్టో మీరే నిర్ణయం తీసుకోమని తాము లేఖ రాసినట్లు తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో వరల్డ్‌ బ్యాంకు జోక్యాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించడంతో అమరావతికి రుణాన్ని ఉపసంహరించుకుందంటూ బుగ్గన ఫుల్ డిటైల్ట్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

బుగ్గన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చెప్పిన ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాస్తవాలను సభలో పెట్టారని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చివరికి మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారంటూ వైసీపీపై విరుచుకుపడ్డారు. అయితే అమరావతికి రుణం రాకుండా అడ్డుకున్న దుర్మార్గులు మీరేనంటూ అధికారపక్షాన్ని ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించడంతో సభలో రగడ జరిగింది. బాబుకి కౌంటరిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి మంత్రి స్టేట్‌‌మెంట్‌ ఇచ్చాక క్లారిఫికేషన్ మాత్రమే అడగాలన్న కనీస జ్ఞానం లేదా అంటూ ఘటు వ్యాఖ్యలు చేశారు. దాంతో సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ నినాదాల మధ్యే జగన్ తన స్పీచ్‌‌ను కంప్లీట్‌ చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories