Happy Bhogi 2020: భోగి విశిష్టత..

Happy Bhogi 2020: భోగి విశిష్టత..
x
Highlights

ప్రజలంతా భోగ భాగ్యాలతో, సంతోషాలతో ఉండేందుకు జరుపుకునేదే భోగి. ఈ పండగను ఎక్కువగా ఆంధ్రులు జరుపుకుంటారు. తెలంగాణలో దసరా ఎంత ప్రాముఖ్యత గాంచిన పండగో అదే...

ప్రజలంతా భోగ భాగ్యాలతో, సంతోషాలతో ఉండేందుకు జరుపుకునేదే భోగి. ఈ పండగను ఎక్కువగా ఆంధ్రులు జరుపుకుంటారు. తెలంగాణలో దసరా ఎంత ప్రాముఖ్యత గాంచిన పండగో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పండగ అంత ప్రాముఖ్యత గాంచింది.

మూడు రోజులపాటు జరుపుకునే సంకాత్రిలో మొదటి పండగే భోగి. ఈ పండగ ప్రతి ఏడాది సాధారణంగా జనవరి 13, జనవరి 14 తేదీలలో, సరిగ్గా ఎముకులు కొరికే చలి ఉన్న సమయంలో వస్తుంది. దీంతో ప్రజలంతా తమ ఇంటిలో ఉన్న పాత వస్తువులను ఒక చోట పెట్టి మంటలు పెడతారు. ఆ భోగి మంటల్లో హాయిగా చలి కాచుకుంటారు.

అంతే కాక భోగిమంటలకు ఎక్కువగా తాటిఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు. చలి కాచుకొని మంటలపై కాచిన నీటితో తలస్నానం చేసి, భోగి ముగ్గులు వేసి, భోగి పాటలు, నృత్యాలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీ.

భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు.

భోగి పండ్లు..

ఉదయం చలి మంటలు కాచుకుని సాయంత్రం వేళల్లో చిన్న పిల్లలు ఉన్న వారు భోగిపల్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఐదేళ్లలోపు చిన్న పిల్లల తలపై నుంచీ చిల్లర నాణేలతో కలిపి భోగి పళ్లు అంటే చిన్న రేగుపల్లను పోస్తారు. చిన్న పిల్లలకు ఈ ఏడాదంతా ఎలాంటి సమస్యలూ, అనారోగ్యాలూ రాకుండా భోగి పళ్లను పోస్తారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రేగు పండ్లు తలపై నుంచీ పోయడం వల్ల ఆ పిల్లల్ని శ్రీమహావిష్ణువు కరుణిస్తారని చెబుతుంటారు. మరో కోణంలో రేగు పళ్లు సూర్యుడికి కూడా ఇష్టమైనవి. సూర్యభగవానుడు కూడా దీవిస్తాడని భావిస్తారు.

అనంతరం పెద్దలంగా చిన్నారులను ఆశీర్వదిస్తారు. చిన్నపిల్లలపై భోగిపళ్లను తలపై పోయడం వల్ల పిల్లలకు పెద్దల ఆశీర్వచనాలు కలుగుతాయని అంటారు. అంతే కాక భోగిపల్లు పోయడం వలన పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు. ఈ సంప్రదాయం ద్వారా ప్రకృతిలో లభించే అనేక రకాల పండ్లు, పూలపై పిల్లలకు ఆసక్తి కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో భోగి పళ్లు పోసే సంస్కృతి కనిపిస్తోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories