పార్టీ మార్పుపై బోండా ఉమా క్లారిటీ..

పార్టీ మార్పుపై బోండా ఉమా క్లారిటీ..
x
Highlights

టీడీపీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై బొండా స్పందించారు.ప్రస్తుతానికి ఈ విషయంపై తానేం మాట్లాడనన్నారు. సోమవారం నాడు చంద్రబాబుతో భేటీ అవుతున్నన్నానని, ఆ తరువాత మీడియాతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు.

ఆయన అరిస్తే అరుపులే.. బీపీ పెరిగితే కరుస్తానంటాడు. తెలుగుదేశం హయాంలో అసెంబ్లీలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయాడు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం మొన్నటి ఎన్నికల్లో అత్యంత స్వల్ప తేడాతో ఓడిపోయిడు. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నాడు. అయితే గత కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నారని జోరుగా వార్తలు వినిపించాయి. ఆయనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు. దీంతో తాను టీడీపీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై బొండా స్పందించారు. ప్రస్తుతానికి తాను ఈ విషయంపై తానేం మాట్లాడనన్నారు. సోమవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అవుతున్ననని అనంతరం మీడియాతో మాట్లాడుతానని అన్నారు.

తాను పార్టీ మారుతున్నట్లు ఎప్పుడు చెప్పలేదని, మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయన్నారు. కాగా ఇటీవలే విదేశాలకు వెళ్లి, తిరిగి వచ్చిన బోండా ఉమా శనివారం నాడు పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నను కలిశారు. ఆపై బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకే తాను ఉమను కలిశానని తెలిపారు . బొండా ఉమ టీడీపీలోనే కొనసాగుతారని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత బోండా ఉమా ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న అంశం ఇప్పుడు హట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories