కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పరిసరాల్లో బాంబ్ స్కాడ్ తనిఖీలు

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పరిసరాల్లో బాంబ్ స్కాడ్ తనిఖీలు
x
Highlights

తిరుపతిలో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను...

తిరుపతిలో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. చిత్తూరు వెస్ట్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాణిపాకం పోలీసులు, బాంబ్ స్వ్కాడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో కాణిపాకం వచ్చే భక్తుల వాహనాలను, ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

తనిఖీల్లో భాగంగా ఆగరం పల్లి వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ వద్ద వాహనాలను..సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఆలయ గాలిగోపురం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులను తనిఖీ చేసిన అనంతరం దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాణిపాకంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories