సద్దుమణగని టీటీడీ భూముల వేలం ప్రక్రియ వివాదం.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బీజేపీ ఎంపీ..

సద్దుమణగని టీటీడీ భూముల వేలం ప్రక్రియ వివాదం.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బీజేపీ ఎంపీ..
x
Highlights

శ్రీవారీ భూముల వేలం ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసినా వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన ఈ...

శ్రీవారీ భూముల వేలం ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసినా వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన ఈ అంశంలో సీన్‌లోకి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం జాతీయ అంశంగా మారిపోయింది. ఓ వైపు బీజేపీ నేతలు దీక్షలు చేయగా మరోవైపు తిరుమల తిరుపతి ఆస్తులను నేషనల్‌ లెవెల్లో ఆడిటింగ్‌ జరపాలని టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు డిమాండ్ చేశారు.

టీటీడీ ఆస్తుల వేలం ప్రక్రియ వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై బీజేపీ నాయకులు ఒక్కరోజు దీక్ష చేయగా ఈ విషయంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం జగన్‌ను క్రిస్టియన్‌ సీఎంగా అభివర్ణిస్తూనే ఆయనకు సపోర్ట్‌గా ట్వీట్ చేశారు. హిందూ దేవాలయాల గురించి ఓ క్రిస్టియన్ సీఎంను సమాధానం అడుగుతున్నారు కానీ ఓ హిందూ సీఎం ఆలయాలన్నింటినీ ఆధీనంలోకి తీసుకున్నారు. తనను తాను ఛైర్మన్‌గా ప్రకటించుకున్నారు. మరి దాని మాటేమిటి..? హిందూత్వ పట్టాలు తప్పిందా..? అని ట్వీట్‌లో ప్రశ్నించారు.

మరోవైపు ట్విట్టర్‌ వేదికగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్‌ జరగాలని రమణ దీక్షితులు డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌ కాలం నుంచి నేటి వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాల ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్‌ జరపాలని ఆయన పేర్కొన్నారు. తన డిమాండ్లను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి ట్విట్లర్‌కు ట్యాగ్‌ చేశారు.

మరోవైపు శ్రీవారి ఆస్తులు కాపాడాలంటూ మంగళవారం బీజేపీ నాయకులు ఇళ్లల్లోనే ఉపవాస దీక్షలు చేశారు. దేవాలయాల విషయంలో ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని విమర్శిస్తున్నారు. ఆస్తల వేలంపై సోమవారం ప్రభుత్వం జారీ చేసిన జీవోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా తప్పుబట్టారు. తాత్కాలిక రద్దు కాదని వేలం ప్రక్రియను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఆలయాలకు సంబంధించిన భూములు, ఆస్తులను అమ్మకుండా ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్ చేశారు. రివర్స్‌ టెండర్స్‌ను తెరపైకి తీసుకొచ్చిన జగన్‌ సర్కార్‌ టీటీడీ విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా రివర్స్‌ గా మార్చాలని జీవీఎల్ సూచించారు.

టీటీడీ భూముల వేలం వివాదం మరింత ముదిరే అవకాశం ఉండటంతో సర్కారు దిద్దుబాటు చర్యలు తీసుకున్నా విమర్శలు, ఆరోపణలు మాత్రం ఆగడం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories