వైసీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ నేతలు

వైసీపీని టార్గెట్ చేస్తున్న బీజేపీ నేతలు
x
Highlights

ఏపీలో వైసీపీ, బీపేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న, మొన్నటి వరకూ మిత్రులుగా ఉన్న ఈ రెండు పార్టీలూ.. ప్రస్తుతం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.....

ఏపీలో వైసీపీ, బీపేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న, మొన్నటి వరకూ మిత్రులుగా ఉన్న ఈ రెండు పార్టీలూ.. ప్రస్తుతం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.. పోలవరంతో పాటు ఇతర ప్రజా సమస్యలపై అధికార పార్టీని బీజేపీ టార్గెట్ చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయంగా పట్టుకోసం కుస్తీ పడుతున్న ఈ రెండు పార్టీలూ కేంద్రంలో మాత్రం దోస్తీ కడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా.. ఏపీలో మాత్రం కనీసం ఖాతా తెరవలేదు.. ఇదే సమయంలో టీడీపీ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బీజేపీ నేతలు వైసీపీ నిర్ణయాలను టార్గెట్ చేస్తున్నారు.. అందుకు తగ్గ వ్యూహాలకు పడును పెడుతున్నారు.

కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ తీరుని బీజేపీ తప్పుపడుతుంది. కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5శాతం అమలు చేయాలని బీజేపీ అంటుంది. మరో వైపు పోలవరం టెండర్ల రద్దుపైన ప్రభుత్వ తీరుని తప్పు పడుతున్నారు. అదే సమయంలో బీజేపీ విషయంలో ఇంత కాలం ఆచి తూచి వ్యవహరించిన వైసీపీ నేతలు ఎదురుదాకి మొదలు పెట్టారు. ముఖ్యంగా సుజనా చౌదరి పోలవరం విషయంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు మండి పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతిని బయటకు తీస్తే సుజనా చౌదరికి ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్‌ల విషయంలో తెలుగు దేశం ప్రభుత్వాన్ని గతంలో తప్పు పట్టిన కన్నా లాంటి వారు ఇప్పుడు ఎందుకు వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ , వైసీపీ మధ్య రాజకీయంగా మాటల తూటాలు పేలుతున్నా, ఢిల్లీ స్థాయిలో మాత్రం అంశాల వారిగా రెండు ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయి. ట్రిపుల్ తాలక్ బిల్లు పై ఓటింగ్ సందర్భంగా వైసీపీ కొన్ని అంశాల పై బీజేపీ తో విభేదించింది. ఇక కాశ్మీర్ అంశానికి సంబంధించి 370 రద్దు పై కేంద్ర నిర్ణయానికి వైసీపీ మద్దతు ప్రకటించింది. ఇక ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తో పోరాటానికి సిద్ధం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. భవిష్యత్ లో ప్రత్యేక హోదా తో పాటు విభజన హామీల విషయంలో.. ఎలా వ్యవహరిస్తాయో వేచి చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories