Top
logo

సీఎం జగన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలి: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

సీఎం జగన్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలి: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
X
Byreddy Rajasekhar Reddy
Highlights

సీఎం జగన్‌పై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సెటైర్ వేశారు. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పారాసెటిమాల్...

సీఎం జగన్‌పై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సెటైర్ వేశారు. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పారాసెటిమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నోబెల్ బహుమతి ఇవ్వాలన్నారు. జగన్ తానే ఒక శాస్త్రవేత్త అన్నట్లు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో స్థానిక ఎన్నికలను జరపకూడదని ఎన్నికల సంఘానికి రెండు రోజుల క్రితమే తాను ఫిర్యాదు చేశానని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేసిన ఎస్ఈసీ రమేష్ కుమార్ రియల్ హీరో అని బైరెడ్డి ప్రశంసించారు. కరోనా వైరస్‌పై సీఎం జగన్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాల క్లిప్పింగ్స్‌ను రాష్ట్రపతి, గవర్నర్, డబ్ల్యూహెచ్‌వో, నేషనల్ హ్యూమన్‌ రైట్స్, విదేశీ ఆరోగ్య సంస్థలకు పంపిస్తానని ఆయన తెలిపారు. ప్రజలు చచ్చినా పర్లేదు కానీ, తాను రాజకీయ లబ్ధి పొందాలని జగన్ భావిస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు.

Web TitleBJP leader Byreddy Rajasekhar Reddy Comments on cm Jagan
Next Story