ఆ మహా వృక్షంపై విష ప్రయోగం..?

ఆ మహా వృక్షంపై విష ప్రయోగం..?
x
Highlights

ఆ చెట్టే ఆ నగరానికి ఐకాన్ అంతటి చరిత్ర కల్గి ఉన్న మహావృక్షం కుప్పకూలింది. చెట్టు దానంతట అదే కూలిందా..? విష ప్రయోగం చేసి కూల్చేశారా అన్నది...

ఆ చెట్టే ఆ నగరానికి ఐకాన్ అంతటి చరిత్ర కల్గి ఉన్న మహావృక్షం కుప్పకూలింది. చెట్టు దానంతట అదే కూలిందా..? విష ప్రయోగం చేసి కూల్చేశారా అన్నది వివాదాస్పదమయ్యింది. చెట్టు పడిపోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాలులు వెల్లువెత్తాయి న్యాయం కోసం పోరాడేందుకు సిద్దమయ్యారు. ఏలూరులో పెరుగు చెట్టు వివాదంపై స్పెషల్ రిపోర్ట్.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పెరుగు చెట్టు సెంటర్ అంటే తెలియనివారుండరు. ఇంకా చెప్పాలంటే ఆ చెట్టే నగరానికి ఐకాన్. ఏలూరు అంటే పెరుగు చెట్టు సెంటర్ పెరుగు చెట్టు సెంటర్ అంటే ఏలూరు అంతటి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఈ చెట్టే వివాదాలకు కేంద్రంగా మారింది.

ఏలూరు వన్ టౌన్ ప్రాంతంలో సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నాటి మర్రిచెట్టు పెరిగి మహావృక్షంలా మారింది. దశాబ్దాలుగా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ఎందరో వ్యాపారులు ఇదే చెట్టు కింద పాలు, పెరుగు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండే వారు. క్రమంగా ఈ చెట్టు కాస్తా పెరుగు చెట్టుగా మారింది. అంతటి ప్రసిద్ది చెందిన చెట్టు ఉన్నట్లుండి నేలకొరగటంపై పలు అనుమానాలకు తావిస్తుంది. కావాలనే కొందరు చెట్టుపై విష ప్రయోగం చేశారంటున్నారు నగరవాసులు.

సహజంగా చెట్టు కూలితే చెట్టు వేళ్లు పచ్చిగా ఉంటాయి కానీ కూలిన ఈ చెట్టు వెళ్లు పట్టుకుంటే పొడిగా మారిపోతున్నాయి. వందల సంవత్సరాల నాటి చెట్టును కూల్చడం సాధ్యం కాదని పలువురు అంటున్నారు. చెట్టు పడి ఉండటాన్నిపరిశీలించిన అటివీశాఖ అధికారులు సైతం విష ప్రయోగం జరిగిందంటూ ప్రాథమిక అంచనాకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు.

పెరుగుచెట్టు సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న వాణిజ్య సముదాయానికి ఈ చెట్టు అడ్డుగా మారుతుందని భావించి చెట్టుపై విషప్రయోగం చేశారని స్తానికులు ఆరోపిస్తున్నారు. చెట్టు చూట్టూ గోతలు తవ్వి రసాయనాలు పోసి చెట్టు వేర్లు కుళ్లిపోయేలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చెట్టు కూల్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ విశ్వహిందు పరిషత్ తో పాటు హిందూ ధార్మిక సంఘాలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అటవీశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. న్యాయం చేయకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

ఏలూరు ఐకాన్ భవిష్యత్ తరాల వారికి గుర్తుండే విధంగా కూలిన మహావృక్షం స్థలంలోనే మరో చెట్టు పెంచాలని నగరవాసులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories