చివరి ఫోన్ సంభాషణే కోడెల ప్రాణం తీసిందా?

చివరి ఫోన్ సంభాషణే కోడెల ప్రాణం తీసిందా?
x
Highlights

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో పోస్ట్‌మార్టం కీలకంగా మారనుంది. అయితే ముఖ్యమైన మొబైల్‌ మిస్‌...

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో పోస్ట్‌మార్టం కీలకంగా మారనుంది. అయితే ముఖ్యమైన మొబైల్‌ మిస్‌ అయ్యింది. సోమవారం సాయంత్రం నుంచి కోడెల మొబైల్‌ మనుగడలో లేనట్టు పోలీసులు చెప్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన కుమారుడ్ని విచారణ చేయనున్నారు పోలీసులు.

కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేగుతుంది. ఆయన ఆత్మహత్య ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. దీంతో హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ కేసు ఇన్వెస్టిగేషన్‌ భాద్యతలు బంజారాహిల్స్ ఏసీపీకి అప్పగించారు. ఏసీపీ కేఎస్ రావు విచారణ వేగావతం చేశారు. కోడెల కూతురు విజయలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలు, అపోహలు రావడంతో కేసును టెక్నికల్ గా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న రూమ్ ను రెండు గంటలు పాటు పరిశీలించి క్లూస్ ను సేకరించారు. అయితే కేసులో మరో కీలక ఆధారమైన వ్యక్తిగత మొబైల్ మిస్ అయినట్లు సమాచారం. సోమవారం కోడెల కుటుంబసభ్యులు విషాదంలో ఉండడంతో పోలీసులు ఆయన మొబైల్‌ని సేకరించలేదు. ఆ తర్వాత మొబైల్‌ తీసుకోవాలని పోలీసులు భావించగా స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. మొబైల్‌పై కుటుంబసభ్యులను విచారిస్తే తమకు తెలియదంటూ సమాధానమిచ్చారు.

కోడెల కాల్‌ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. సోమవారం ఉదయం 8.30 నిమిషాలకు కోడెల మొబైల్ నుండి కాల్ వెళ్ళినట్లు గుర్తించారు. ఆ చివరి కాల్ 24 నిమిషాలు పాటు మాట్లాడినట్లు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు రెండు రోజులు కాల్ డేటాను బంజారాహిల్స్ పోలీసులు పరిశీలిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత ఆయన కుమారుడు శివరాంను కూడా పోలీసులు విచారించనున్నారు.

ఇక కోడెల శివ ప్రసాద్ ప్రిలింనరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బంజారా హిల్స్ పోలీసులకి చేరింది. ఉస్మానియా వైద్యులు ఆ రిపోర్ట్‌ను బంజారాహిల్స్ పోలీసులకి అందించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కోడెల కేబుల్ వైర్ ఉపయోగించిడంతో హెడ్ బోన్ ఫ్రాక్షర్‌ అయ్యి ఊపిరి ఆడక మృతి చెందినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రెండు గంటల పాటు నిర్వహించిన పోస్ట్‌మార్టం మొత్తం విడియో గ్రఫీ చేశారు వైద్యులు. అయితే ఈ కేసులో ప్రధానంగా కోడెల మొబైల్ దొరికితే కొంత పురోగతి లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories