Top
logo

దొడ్డిదారిన బీజేపీలోకి టీడీపీ ఎంపీలు జంప్ : అవంతి శ్రీనివాస్

దొడ్డిదారిన బీజేపీలోకి టీడీపీ ఎంపీలు జంప్ : అవంతి శ్రీనివాస్
Highlights

జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు దొడ్డిదారిన తన అనుచరులను బీజేపీలోకి పంపారని విమర్శించారు ఏపీ మంత్రి...

జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు దొడ్డిదారిన తన అనుచరులను బీజేపీలోకి పంపారని విమర్శించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఇవాళ తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన టీడీపీ ఎంపీల గురించి కామెంట్ చేశారు. గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అవినీతిపై కేంద్రం సీరియస్‌గా ఉందని, దీంతో కేసుల్లో ఇరుక్కుంటామన్న భయంతో నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీకిలోకి వెళ్లారని ఆరోపించారు. గంటా శ్రీనివాసరావును కూడా త్వరలోనే బీజేపీ గూటికి పంపుతారని, ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అవంతి అన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు తమ వద్దకే వస్తారన్న అమిత్ షా వ్యాఖ్యలను ఈ సందర్భంగా అవంతి గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యల ఇప్పుడు నిజం అవుతున్నాయని, కమలం గూటికి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.


లైవ్ టీవి


Share it
Top