ఆసీస్ ను కట్టడి చేసిన భారత బౌలర్లు..

ఆసీస్ ను కట్టడి చేసిన భారత బౌలర్లు..
x
Highlights

కీలక మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆసీస్ పై విరుచుకుపడ్డారు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుక్ను ఆసీస్‌ ఫించ్‌ (27 పరుగులు), ఖవాజా (100),...

కీలక మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆసీస్ పై విరుచుకుపడ్డారు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుక్ను ఆసీస్‌ ఫించ్‌ (27 పరుగులు), ఖవాజా (100), హ్యాండ్స్‌కోంబ్‌ (52) రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనించింది. అయితే 30 ఓవర్ల తర్వాత టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఖంగారులను కట్టడి చేశారు. 33వ ఓవర్‌లో చక్కని బంతితో భువనేశ్వర్‌ ఖవాజాను ఔట్‌ చేశాడు.

రెండు ఓవర్ల తర్వాత జడేజా ఊరిస్తూ వేసిన ఆఫ్‌ స్పిన్‌ బాల్‌కు హిట్టింగ్‌కు వెళ్లి కోహ్లీ చేతికి చిక్కాడు మ్యాక్స్‌వెల్‌. 37వ ఓవర్‌ రెండో బంతికి ధాటిగా ఆడుత్నున్న హ్యాండ్స్‌కోంబ్‌ను షమీ బోల్తా కొట్టించాడు. స్టొయినిస్‌ను భువీ, అలెక్స్‌ కరేను షమీ ఔట్‌ చేయగా.. 4వ వన్డే హీరో టర్నర్‌ను స్పిన్నర్‌ కుల్దీప్‌ పెవిలియన్‌ పంపాడు. దీంతో మూడొందల పైచిలుకు స్కోర్ దాటుతుందని అనుకున్నా.. చివరకు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories