నన్ను ఎర్రగడ్డకు పంపిస్తే.. అచ్చెన్నాయుడుని వెటర్నరీ ఆసుపత్రిలో చేర్చాలి: మంత్రి కొడాలి

నన్ను ఎర్రగడ్డకు పంపిస్తే.. అచ్చెన్నాయుడుని వెటర్నరీ ఆసుపత్రిలో చేర్చాలి: మంత్రి కొడాలి
x
కొడాలి నాని
Highlights

ఏపీ అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి కొడాలి నాని మాటలు వినలేకపోతున్నామని కొడాలిని ఎర్రగడ్డ...

ఏపీ అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి కొడాలి నాని మాటలు వినలేకపోతున్నామని కొడాలిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో చేర్చాలంటూ అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో, స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు కొడాలి నాని, అచ్చెన్నాయుడును పశువుల ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఒక మానసిక వైకల్య కేంద్రాన్ని ఇచ్చినట్టు తమ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి చెబితే విన్నానని, ఆ ఆసుపత్రిని అమరావతిలో 'శ్రీ నారా చంద్రబాబునాయుడు మానసిక వైకల్య కేంద్రం'గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ని కోరుతున్నానంటూ సెటైర్లు విసిరారు మంత్రి కొడాలి నాని. ఆ ఆసుపత్రిలో మొట్టమొదటి పేషెంట్ గా చంద్రబాబుని, ఆయనతో పాటు పిచ్చెక్కితిరుగుతూ మార్షల్స్ ను కొడుతున్న వాళ్లనూ ఈ ఆసుపత్రిలో చేర్చాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories