శ్రీవారి దర్శనానికి వేగంగా ఏర్పాట్లు

శ్రీవారి దర్శనానికి వేగంగా ఏర్పాట్లు
x
Highlights

లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపధ్యంలో ఏపీలో ఆలయాలు భక్తుల కోసం తెరవడానికి అన్ని ఏర్పాట్లూ వేగంగా చేస్తున్నారు.

లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపధ్యంలో ఏపీలో ఆలయాలు భక్తుల కోసం తెరవడానికి అన్ని ఏర్పాట్లూ వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే ఆయా దేవాలయాలకు దేవాదాయశాఖ గైడ్ లైన్స్ పంపించింది. ఈమేరకు ఏపీలో ఆలయాలన్నీ భక్తుల కోసం సిద్ధం అవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా శ్రీవారి దర్శనభాగ్యం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వైరస్ నేపధ్యంలో భక్తులకు ఇబ్బంది లేని విధంగా అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. చిత్తూరు ఎస్పీ ర‌మేష్ రెడ్డి బుధవారం తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. టీటీడీ నిర్ణయాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ అన్ని రకాల పటిష్ట చర్యలూ తీసుకుంటోందని అయన చెప్పారు. ఆలయంలో భౌతిక దూరం పాటించే విధంగా లైన్లలో మార్కింగ్ చేయడం జరిగిందన్నారు.

ఈ విషయంలో ఆలయ సిబ్బందికి ఎలా భక్తులకు ఇబ్బంది కలగకుండా శ్రీవారి దర్శనం కలిగేలా చేయాలనే అంశం పై మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందాన్నారు. తిరుమలకు వచ్చిన భక్తులలో ఎవరికైనా కోవిడ్ సోకిన అనుమానం వస్తే వెంటనే వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం బయట దుకాణాలు తెరుచుకోవడానికి కూడా అనుమతి ఇస్తున్నామన్నారు. అయితే, జనం ఎక్కువగా దుకాణాల దగ్గర గుమికూడకుండా భౌతిక దూరం పాటించే చర్యలు దుకాణాదారులు తీసుకోవాలన్నారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ఎలా వ్యవహరించాలని చెబుతున్నామన్నారు. అందరినీ వాచ్ చేస్తూ పోలీసు శాఖ ఉంటుందనీ, అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామనీ వివరించారు.

అదేవిధంగా తిరుమ‌ల ఇంత వ‌ర‌కు గ్రీన్ జోన్ గానే వుంది. అయితే, తిరుపతి ‌నుంచి పైకి వ‌చ్చే వారికి తిరుప‌తి లో కొన్ని కేస‌స్ కార‌ణంగా దాని ఇంపాక్ట్ ఎలా వుంటుంది అనేది కూడా ప‌రిశీలిస్తున్నామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. మొదటి వారం రోజులూ కీలకమనీ, అప్పుడే అన్ని విషయాలు అర్థం అవుతాయనీ చెప్పారు. దానిని బట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో భక్తులకు ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యెక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా శ్రీ కాళ‌హ‌స్తీ దేవాల‌యంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని అన్ని ముఖ్య దేవాలయాలనూ పరిశీలిస్తూ, కరోనా పట్ల అప్రమత్తంగా వున్నామ‌ని తెలిపారు ఎప్సీ ర‌మేష్ రెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories