Top
logo

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరకు ఎంపీ మాధవి ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అరకు ఎంపీ మాధవి ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో
Highlights

అరకు ఎంపీ గొట్టేటి మాధవి త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నారు. ఆమె చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్ ను పెళ్లి...

అరకు ఎంపీ గొట్టేటి మాధవి త్వరలో పెళ్ళి పీటలెక్కనున్నారు. ఆమె చిన్ననాటి స్నేహితుడు శివప్రసాద్ ను పెళ్లి చేసుకోబోతున్నారు దీంతో ఇరు కుటుంబాలతో పాటు అరకు పార్లమెంట్ సెగ్మెంట్ లో సందడి మొదలైంది. అతి పిన్న వయసులో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పెళ్లి ఈ నెల 17న జరగనుంది. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్‌ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. గొలుగొండ మండలం కేడి పేట గ్రామానికి చెందిన శివప్రసాద్‌ బి.టెక్‌, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం కరస్పాండెట్‌గా ఓ కాలేజ్‌ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్‌ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ప్రేమకు అందరూ దాసులేనని ఈ వీడియో రుజువు చేస్తోంది. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక​ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్‌ నుంచి భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్‌చంద్రదేవ్‌ని ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి ఇంటికి సాగనంపారు.

వెడ్డింగ్ వీడియో కూడా అరకు ప్రాంతం విశిష్టత తెలిపే విధంగా చిత్రీకరించామని, వీడియో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి మన్యం అందాలు తెలుసుకుంటారని ఎం.పి మాధవి అన్నారు. తమ స్వగ్రామంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటున్నానని, తమ గ్రామాలతో పాటు అరకు పార్లమెంట్ పరిధిలో వివిద ప్రాంతాల ప్రజలు కూడా పెళ్లికి హాజరవుతారని ఆమె తెలిపారు.

Next Story

లైవ్ టీవి


Share it