రంజాన్ కు మినహాయింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. మినహాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విపక్షాలు

రంజాన్ కు మినహాయింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. మినహాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విపక్షాలు
x
Highlights

రంజాన్ మాసంలో ప్రార్థనలకు మినహాయింపులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై...

రంజాన్ మాసంలో ప్రార్థనలకు మినహాయింపులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో మినహాయింపులు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.

రంజాన్ మాసంలో ముస్లింలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే ప్రార్థనలు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం రంజాన్ మాసంలో ప్రతీరోజూ ఐదు పూటలా ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుమతులిచ్చారు. అయితే మసీదుల్లో మాత్రం కేవలం 5 మందికి మాత్రమే అనుమతినిచ్చింది. ఇందులో మౌజన్, ఇమామ్ తో పాటు మరో ముగ్గురు మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. ప్రార్థనలు, సెహరీ, ఇఫ్తార్ సమయాలను సూచించేందుకు మసీదుల్లో అజాన్, సైరన్ ఇచ్చేందుకు అనుమతిచ్చారు.

రంజాన్ మాసంలో ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా కొన్ని సడలింపులు ఇస్తూ ఆయా శాఖలకు ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో 24 గంటల మంచినీరు, విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదే‎శించింది. కూరగాయలు, పండ్ల మార్కెట్ లను ఉదయం 10 గంటల వరకు తెరిచేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. మౌజన్ లు, ఇమాములు మజీదుల్లో ప్రార్థనలు చేసేందుకు వారికి వక్ఫ్ బోర్డు అధికారిక పాసులు ఇచ్చే ఏర్పాటు చేస్తోంది.

సెహరీ, ఇఫ్తార్ సమయాల్లో ఆహారం పంపిణీకి ఉదయం 3 గంటల నుండి నాలుగు గంటల 30 నిమిషాల వరకు అలాగే సాయంత్రం 5 గంటల30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు వెసులుబాటు కల్పించింది. ఫలహారాలు, భోజనాల దానం చేయటంతో పాటు హోటళ్ల నుంచి టేక్ అవే ద్వారా ఆహార పంపిణీకి అనుమతినిచ్చింది ప్రభుత్వం. కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్న బాధితులు, క్వారంటైన్ లో ఉన్న ముస్లింలకు ఇఫ్తార్ సమయాల్లో పౌష్టికాహారం పంపిణీ చేసే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. లాక్ డౌన్ నిబంధనలు, సూచనలు తెలిపేలా బ్యానర్లు కూడా ఏర్పాటు చేయనుంది.

మరోవైపు ముస్లిం మత పెద్దలు కూడా ఇప్పటికే రంజాన్ నిర్వహణపై సూచనలు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా రంజాన్ జరపాలన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో మినహాయింపులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని విపక్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories