Top
logo

స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు

స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు
Highlights

శ్రీకాకుళం జిల్లా లోగ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

శ్రీకాకుళం జిల్లా లోగ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టిడిపికి చెందిన కోన్ కిస్కా గొట్టాం గాడు వాలంటీర్ వ్యవస్ధపై పిటిషన్లు వేస్తే భయపడకండంటూ వాలంటీర్లకు భరోసా ఇచ్చారు. ముందు తాను ఆముదాలవలస ఎమ్మెల్యేనని... ఆ తర్వాతే స్పీకర్‌రనని అంటూ ఆవేశంగా ప్రసంగించారు. స్పీకర్ రివ్యూలు చేయకూడదంటూ కొంతమంది అజ్ఞానులు మాట్లాడుతున్నారని, తనను గెలిపించిన ప్రజలకు సమస్యలు వస్తే ఎవరు చూసుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్‌గా తనకు విశేష అధికారాలున్నాయన్న విషయాన్ని తనపై విమర్శలు చేసే నాయకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి దమ్ముండాలన్నారు. శాసన సభలో సామాజిక న్యాయంతో చట్టాలు చేసే దమ్మున్న వ్యక్తి జగన్ అని ఆయన కితాబిచ్చారు.


Next Story

లైవ్ టీవి


Share it