దాదాపు కోటి మందికి రేషన్ పంపిణీ పూర్తి : ఏపీ మంత్రి కొడాలి నాని

దాదాపు కోటి మందికి రేషన్ పంపిణీ పూర్తి : ఏపీ మంత్రి కొడాలి నాని
x
Kodali nani (File Photo)
Highlights

రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు.

రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మంత్రి కొడాలి నాని క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆఖరి కార్డు దారుడికి కూడా నిత్యావసర సరుకులను అందజేసే వరకు రేషన్ షాపులను తెరిచే ఉంచుతామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి రేషన్ కార్డుకు ఒక కేజీ కందిపప్పు, కార్డులోని ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని 14 లక్షల 13 వేల 244 రేషన్ కార్డులకు 23 వేల 075 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 290 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని మంత్రి కొడాలి నాని చెప్పారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 47 లక్షల 24 వేల 017 రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. వీటిలో ఇప్పటి వరకు ఒక కోటి 29 వేల 833 రేషన్ కార్డులకు మొత్తం ఒక లక్ష 61 వేల 423 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 290 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. కాగా, అనంతపురం జిల్లాలో 12 లక్షల 23 వేల 684 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 42 వేల 511 రేషన్ కార్డులకు 14 వేల 755 మెట్రిక్ టన్నుల బియ్యం, 587 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామన్నారు.

అలాగే చిత్తూరు జిల్లాలో 11 లక్షల 33 వేల 535 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 9 లక్షల 364 రేషన్ కార్డులకు 15 వేల 618 మెట్రిక్ టన్నుల బియ్యం, 890 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో 16 లక్షల 50 వేల 254 రేషన్ కార్డులు ఉండగా, వీటిలో 11 లక్షల 36 వేల 588 రేషన్ కార్డులకు 17 వేల 346 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 860 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు.

గుంటూరు జిల్లాలో 14 లక్షల ఎనభై తొమ్మిది వేల 439 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 10 లక్షల 75 వేల 805 రేషన్ కార్డులకు 16 వేల 536 మెట్రిక్ టన్నుల బియ్యం, 1, 058 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. కడప జిల్లాలో 8 లక్షల 02 వేల 039 రేషన్ కార్డు లు ఉండగా, వీటిలో 5 లక్షల 71 వేల 041 రేషన్ కార్డులకు 9 వేల 568 మెట్రిక్ టన్నుల బియ్యం, 567 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని పేర్కొన్నారు.

కృష్ణాజిల్లాలో 12 లక్షల 92 వేల 937 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 8 లక్షల 97 వేల 942 రేషన్ కార్డులకు 13 వేల 918 మెట్రిక్ టన్నుల బియ్యం, 886 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని చెప్పారు. కర్నూలు జిల్లాలో 11 లక్షల 91 వేల 344 రేషన్ కార్డు ఉండగా, వీటిలో 7 లక్షల 37 వేల 762 రేషన్ కార్డులకు 12 వేల 455 మెట్రిక్ టన్నుల బియ్యం, 707 మెట్రిక్ టన్నుల కంది పప్పును సరఫరా చేశామని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో 9 లక్షల 04 వేల 220 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 6 లక్షల 10 వేల 855 రేషన్ కార్డులకు 9 వేల 385 మెట్రిక్ టన్నుల బియ్యం, 487 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామన్నారు. ప్రకాశం జిల్లాలో 9 లక్షల 91 వేల 822 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 6 లక్షల 83 వేల 558 రేషన్ కార్డులకు 10 వేల 805 మెట్రిక్ టన్నుల బియ్యం, 677 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల 29 వేల 024 రేషన్ కార్డు లు ఉండగా, వీటిలో 3 లక్షల 89 వేల 430 రేషన్ కార్డులకు 6 వేల 153 మెట్రిక్ టన్నుల బియ్యం, 369 మెట్రిక్ టన్నుల కందిపప్పును సరఫరా చేశామని తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో 12 లక్షల 45 వేల 266 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 7 లక్షల 65 వేల 953 రేషన్ కార్డులకు 12 వేల 099 మెట్రిక్ టన్నుల బియ్యం, 725 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని చెప్పారు.

విజయనగరం జిల్లాలో 7 లక్షల 10 వేల 528 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 4 లక్షల 87 వేల 401 రేషన్ కార్డులకు 8 వేల 426 మెట్రిక్ టన్నుల బియ్యం, 484 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేశామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 12 లక్షల 59 వేల 925 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 9 లక్షల 30 వేల 673 రేషన్ కార్డులకు 14 వేల 351 మెట్రిక్ టన్నుల బియ్యం, 912 మెట్రిక్ టన్నుల కందిపప్పును అందజేశామని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories