ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా ఏపీ ఐ అండ్ పీఆర్

ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా ఏపీ  ఐ అండ్ పీఆర్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం టి. విజయకుమార్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం టి. విజయకుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలు - ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేయడంలో సమాచార శాఖ ముఖ్య భూమిక పోషించనుందని కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఙతలు తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రప్రజలందరికీ చేరువ చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కాబట్టి వారికి జవాబుదారీతనంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షమేరకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సమాచార, పౌరసంబంధాల శాఖ విధులను నిర్వర్తించడంలో కీలక పాత్ర అయిన మీడియా, జర్నలిస్ట్ లకు ప్రభుత్వ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సకాలంలో సమాచారం అందించేందుకు శాఖలోని ఉద్యోగులంతా కలిసి పనిచేయాలన్నారు. తద్వారా ప్రభుత్వం పనిచేసే కార్యక్రమాలతో పాటు, పనిచేసే ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత ఏర్పడే విధంగా సమాచార శాఖ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ లకు సంబంధించిన సమస్యలపై త్వరలోనే సమీక్ష జరిపి వారికి మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటామని సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories