Top
logo

అక్రమ నిర్మాణాలపై సీఆర్ డీఏ జారీ చేసిన నోటీసులపై ఏపీ హైకోర్టు స్టే

అక్రమ నిర్మాణాలపై సీఆర్ డీఏ జారీ చేసిన నోటీసులపై ఏపీ హైకోర్టు స్టే
Highlights

అక్రమ నిర్మాణాలపై సీఆర్ డీఏ జారీ చేసిన నోటీసులపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. నోటీసులను సవాల్ చేస్తూ చందన...

అక్రమ నిర్మాణాలపై సీఆర్ డీఏ జారీ చేసిన నోటీసులపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. నోటీసులను సవాల్ చేస్తూ చందన బ్రదర్స్ సంస్ధ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులు జారీ చేసే అవకాశం సీఆర్ డీఏకు లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సీఆర్ డీఏ చట్టం రాక ముందే తాము భవనాన్నినిర్మించామని పిటిషనర్ అన్నారు. అనుమతులు లేకపోతే జరిమానా విధించే అవకాశం ఉందని కాని ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా కూల్చేందుకు నోటీసులు ఇచ్చారంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో సీఆర్ డీఏ నోటీసులపై మూడు వారాలు స్టే విధిస్తూ కేసును వాయిదా వేసింది హైకోర్టు.


లైవ్ టీవి


Share it
Top