పోలవరం పనులకు బ్రేక్ వేసిన హైకోర్టు

పోలవరం పనులకు బ్రేక్ వేసిన హైకోర్టు
x
Highlights

పోలవరం పనులకు మరోసారి అడ్డుకట్ట పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను...

పోలవరం పనులకు మరోసారి అడ్డుకట్ట పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ, పనులు నిలిచిపోతే అన్ని విధాలుగా నష్టం వాటిల్లుతుందని కోర్టుకు విన్నవించారు. వరదలు మళ్లీ మొదలైతే పనులు చేపట్టడం కష్టమవుతుందని చెప్పారు. లాయర్ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. మరో 15 రోజులు పనులు నిలిచిపోయినా ఎలాంటి నష్టం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. పోలవరం పనుల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవయుగ సంస్థకు కట్టబెట్టిన హైడల్ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసి ఆ కాంట్రాక్టును మేఘా సంస్థకు అప్పగించింది. గత శుక్రవారం స్పిల్ వే పనులను కూడా మేఘా సంస్థ ప్రారంభించింది. ఇలాంటి తరుణంలో పనులపై హైకోర్టును స్టే విధించడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories