రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టులో విచారణ

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టులో విచారణ
x
Highlights

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని బిల్లును మనీ బిల్లుగా పిటిషనర్ తరపు న్యాయవాది...

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని బిల్లును మనీ బిల్లుగా పిటిషనర్ తరపు న్యాయవాది అశోక్‌బయల్ వాదించడంపై ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మనీ బిల్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమయంలో బిల్లు ఏ దశలో ఉందని ప్రధాన న్యాయమూర్తి అడగ్గా మండలిలో సెలక్ట్‌ కమిటీకి పంపుతూ నిర్ణయం జరిగిందన్న అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో రాజధానికి సంబంధించిన కేసులను ఫిబ్రవరి 26 కి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైకోర్టులో జరిగిన వాదనలను ఎంపీ విజయసాయిరెడ్డి, కేశినేని నాని కోర్టు హాలుకు వచ్చి వాదనలు విన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories