ఏపీలో కొలువుల జాతర..1,28,589 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఏపీలో కొలువుల జాతర..1,28,589 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
x
Highlights

ఏపీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. ఇదివరకు ప్రకటించినట్టుగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే పోస్టుల...

ఏపీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. ఇదివరకు ప్రకటించినట్టుగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే పోస్టుల భర్తీకి అన్ని విధాలుగా గ్రీన్ సిగ్నల్ లభించడంతో.. గ్రామసచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి శుక్రవారం అర్ధరాత్రి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ల ద్వారా అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 1,28,589 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు ఉండగా.. వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ చేయనున్నారు.

కాగా, ఏపీ వ్యాప్తంగా 11,114 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం మొదలుసానుంది. ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా వచ్చేనెల ఆగస్టు 8వ తేదీ వరకు తుది గడువుగా వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) 7040 పోస్టులు, గ్రామ రెవెన్యూ అధికారి (గ్రేడ్-2) 710, ఏఎన్‌ఎం (గ్రేడ్-3) 9754, పశుసంవర్థక సహాయకుడు 9886, మత్స్య సహాయకుడు 794, ఉద్యాన సహాయకుడు 4000, వ్యవసాయ సహాయకుడు (గ్రేడ్-2) 6714, పట్టుపరిశ్రమ సహాయకుడు 400, మహిళా పోలీసు, మహిళా శిశు సంక్షేమ సహాయకుడు 11,158, ఇంజినీరింగ్ సహాకుడు (గ్రేడ్-2) 11158, పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ 6) డిజిటల్ సహాయకుడు 11158, గ్రామ సర్వేయర్ (గ్రేడ్ 3) 11158, సంక్షేమ, విద్యా సహాయుడు 11158 పోస్టులు కలిపి మొత్తం 95,088 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా.. పట్టణాల్లో వార్డుల వారీగా మరో 33,501 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి. ఇన్‌సర్వీస్‌ ఉద్యోగులకు 10 శాతం మార్కుల వెయిటేజి ఇస్తారు. మొత్తానికి జగన్ సర్కార్ నిరుద్యోగులకు చల్లని కబురు చెప్పడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories