టీటీడీ భూముల వ్యవహారంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

టీటీడీ భూముల వ్యవహారంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
x
Highlights

టీటీడీకి చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏపీ...

టీటీడీకి చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2016, జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాడు చేసిన తీర్మానంలో తిరుమల శ్రీవారికి చెందిన 50 భూములను విక్రయించాలని అప్పటి బోర్డు నిర్ణయించింది. ఆ తీర్మానాన్ని తాజాగా నిలిపివేసింది ఏపీ సర్కార్.

భూముల విక్రయానికి సంబంధించి ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక వేత్తలతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో వెల్లడించింది. సంప్రదింపులు పూర్తయ్యే వరకు భూముల విక్రయ ప్రక్రియను నిలిపిివేస్తున్నట్లు తెలిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని టీటీడీకి సూచించింది ఏపీ ప్రభుత్వం. ఈ భూముల్లో టీటీడీ దేవాలయ నిర్మాణాలు, ధర్మ ప్రచారాలు, మతపరమైన అంశాలకు వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories