అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ

అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ
x
Highlights

దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. మద్యం మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రైవేట్ షాపులను రద్దు చేయాలని నిర్ణయించారు.

దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. మద్యం మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రైవేట్ షాపులను రద్దు చేయాలని నిర్ణయించారు.సీఎం జగన్ ఎన్నికల హామీకి అనుగుణంగా పాలసీకి రూపకల్పన చేసిన అధికారులు... ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా విధివిధానాలు రూపొందించారు. అక్టోబర్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దశలవారీగా మద్యం నిషేధం అమలు చేస్తామన్న వైఎస్ జగన్ హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 3వేల 500 దుకాణాలు మాత్రమే నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త పాలసీ ప్రకారం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ మద్యం దుకాణాలను నిర్వహించనుంది. మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఎక్కడెక్కడ షాపులను పెట్టాలనేదానిపై బేవరేజెస్ కార్పొరేషనే నిర్ణయం తీసుకోంది. 150నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో రోడ్డుకు అభిముఖంగా ఉండే షాపులను లీజుకు తీసుకోనున్నారు. అలాగే ప్రతి షాపులో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. ఇక లీజు అద్దెలు నిర్ణయించడం, షాపుల ఎంపిక బాధ్యతను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ చూసుకోనుంది.

మద్యం దుకాణాల్లో ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు విధానంలో ఉద్యోగులను నియమించనుంది ప్రభుత్వం. సూపర్ వైజర్‌, సేల్స్ మేన్స్‌, గార్డు ఉండేలా... రిక్రూట్‌మెంట్ ఉండనుంది. స్థానికతకు పెద్దపీట వేస్తూ, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 21నుంచి 40ఏళ్ల మధ్య వయసున్నవారిని ఉద్యోగులను నియమించుకోనుంది. సూపర్ వైజర్‌కు 17వేల 500, సేల్స్ మెన్స్‌కు 15వేలు... గార్డులకు కార్మిక చట్టాల మేరకు గౌరవ వేతనం ఇవ్వనున్నారు. దుకాణాల్లో ఉద్యోగుల నియామకాలను కూడా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీయే చూసుకోనుంది. అయితే, ఉద్యోగుల పనితీరు బాగుంటే, రెండో ఏడాది కూడా కంటిన్యూ చేయనున్నారు.

ఉదయం 10నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు ఉంటాయి. అలాగే ప్రతి అమ్మకానికి కచ్చితంగా రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తూనే... ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. అసలు బెల్టు షాపు అనేదే కనబడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితం చేయనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories