స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లను నియమించిన ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం

స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లను నియమించిన ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్లో ప్రసారమైన కథనాలు, వార్తలను ఎప్పటికప్పుడు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్లో ప్రసారమైన కథనాలు, వార్తలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తు సమాచారాన్ని అందించేందుకు గాను ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఎనిమిది మందిని 'స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లను నియమించింది. స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు గా నియమితులైన వారిలో లింగారెడ్డి, కేపీ ప్రసాద్‌రెడ్డి, ఐ.నారాయణరెడ్డి, చేకూరి కిరణ్‌, జక్కం సుధాకర్‌రెడ్డి, మల్లాది సందీప్‌కుమార్‌, ఎ.జి.దశరథరామిరెడ్డి, వై.రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.

గతంలో ప్రభుత్వం వీరినిసాంకేతిక సమన్వయకర్తలు నియమించగా ప్రస్తుతం రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీరంతా మాధ్యమాల్లో నిరంతరం ప్రసారమయ్యే కథనాలు, వార్తలపై ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందిస్తూ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో)కు నివేదించవలసి ఉంటుంది. ప్రస్తుతం వీరికి ఇచ్చిన పోస్టులను రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో నిర్వర్తించాలని ప్రభుత్వ నియామక ఉత్తర్వుల్లో వెల్లడించింది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories