మరో మహోన్నత సంక్షేమ పథకానికి సిద్ధమైన జగన్ సర్కార్

మరో మహోన్నత సంక్షేమ పథకానికి సిద్ధమైన జగన్ సర్కార్
x
Highlights

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి రికార్డు స్పష్టించిన ఏపీ ప్రభుత్వం మరో మహోన్నత సంక్షేమ పథకానికి ప్రణాళికలు సిద్ధం...

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి రికార్డు స్పష్టించిన ఏపీ ప్రభుత్వం మరో మహోన్నత సంక్షేమ పథకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పేదవారి సొంతింటి కల సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇళ్లు లేని వారందరికి ఇంటి స‌్థలాలు ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేపట్టంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 24 లక్షల 80 వేల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. వీరి కోసం ఎంత భూమి కొనుగోలు చేయాలనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. క్షేత్ర స్ధాయి నుంచి పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఉగాది రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే వార్డుల వారిగా వివరాలు సేకరించిన వాలంటీర్లు అసలైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు సొంతంగా ఇంటి స్ధలం లేని వారిని ఈ పథకంలో చేర్చనున్నారు. ఆయా గ్రామాలు, మండలాల పరిధిలోనే ఇంటి పట్టాలు కేటాయించాలని... సర్కార్ భూములు లేని చోట ప్రయివేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మార్కెట్ ధరకు వాస్తవ ధరకు తీవ్ర వ్యత్యాసం ఉన్న నేపధ్యంలో కోనుగోలు వ్యవహారాలపై అధికారులు చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories