ప్రజావేదికను ఖాళీ చేయిస్తున్న అధికారులు

ప్రజావేదికను ఖాళీ చేయిస్తున్న అధికారులు
x
Highlights

అమరావతిలో ఉండవల్లి సమీపాన కృష్ణా కరకట్టను ఆనుకుని ఉన్న ప్రజావేదికపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. తాజాగా అధికారులు ప్రజావేదికను...

అమరావతిలో ఉండవల్లి సమీపాన కృష్ణా కరకట్టను ఆనుకుని ఉన్న ప్రజావేదికపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. తాజాగా అధికారులు ప్రజావేదికను ఖాళీ చేయిస్తుండడం, చంద్రబాబు వ్యక్తిగత సామాన్లను సిబ్బంది బయట పడేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నివాస ప్రాంగణం పక్కనే ఉన్న ఈ ప్రజా వేదికను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వాడుకునేందుకు తనకు కేటాయించాలంటూ ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. అయితే చాలా రోజులైనా ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిన్న సాధారణ పరిపాలన శాఖ అధికారులు, సీఆర్‌డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ప్రజావేదిక భవనాన్ని పరిశీలించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. కనీస సమాచారం లేకుండా, తమ నాయకుడి లేఖకు జవాబివ్వకుండా ఇదేం విధానమని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories