జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ.10వేలు సాయం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి రూ.10వేలు సాయం
x
Highlights

మత్స్యకారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను...

మత్స్యకారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్ధిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. లబ్దిదారుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్చి 31 లోపు మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

మరపడవలపై 8 మంది, మోటారు పడవలపై ఆరుగురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం అందించనుంది.

గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు, ఇతర సిబ్బంది పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

లబ్ధిదారుల జాబితా ఖరారు అయిన తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.

ఈ ఏడాది వేట విరామ సమయం ప్రాంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం అందజేస్తుందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories