అన్యమత ప్రచారం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

అన్యమత ప్రచారం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌
x
Highlights

తిరుమలలో బస్‌ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు...

తిరుమలలో బస్‌ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు టిమ్‌ రోల్స్‌ సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లుపై రవాణా శాఖ విచారణ చేపట్టింది. టీడీపీ హయాంలోని కాంట్రాక్టర్లే బస్‌ టికెట్ల టిమ్‌ రోల్స్‌ పంపిణీ చేశారని నిర్ధారించిన అధికారులు బాధ్యులపై చర్యలకు సిద్ధమయ్యారు. అటు విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా తిరుమలలో అన్యమత ప్రచారంపై భగ్గుమన్నారు. సీఎం జగన్‌ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తిరుమలలో అన్యమత ప్రచారం వివాదం

అన్యమత ప్రచారం ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

మనోభావాలను దెబ్బతీయెద్దన్న స్వరూపానందేంద్రస్వామి

చాలారోజుల తర్వాత తర్వాత తిరుమలలో మళ్లీ అన్యమత గొడవలు మొదలయ్యాయి. తిరుమలలోని ఆర్టీసీ బస్‌ టికెట్‌ కౌంటర్లలో అన్యమతానికి సంబంధించిన ముద్రణలు ఉన్నాయన్న విషయం బయటపడటం కలకలం రేపింది. హజ్‌ యాత్ర.. పవిత్ర జెరసలేం యాత్ర అంటూ తిరుమలలో ఇచ్చే టికెట్లపై ఉండటంతో భక్తులు బిత్తరపోయారు. అటు- అన్యమత ప్రచారం పేరుతో ప్రభుత్వంపై విపక్షాలు బురద చల్లాలని చూస్తున్నాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్టు. ఇది బాబు ముఠా ప్రచారమని కొట్టిపారేశారు.

అటు తిరుమల బస్సు టికెట్‌ అన్యమత ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వాటిని ఎవరు చేస్తున్నారు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే నెల్లూరు డిపో నుంచి తిరుమలకు టిమ్‌ రోల్స్‌ను కాంట్రాక్టర్‌ సరఫరా చేశారన్న మంత్రి పేర్ని నాని ఆర్టీసీ టికెట్ల వెనుక ముద్రించి ఉన్నవి టీడీపీ ప్రభుత్వ పథకాల వివరాలేనని చెప్పారు. మరోవైపు తిరుమలలో అన్యమత ప్రచారం గొడవపై విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా మండిపడ్డారు. వైఎస్‌ తన హయాంలోనే హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారం నిషేధించారని, దాన్ని ఇప్పుడు సీఎంగా జగన్‌ పున:సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్యమత ప్రచారం వివాదాన్ని ఆరోపణ, ప్రత్యారోపణలతో కాకుండా పటిష్టమైన ప్రణాళికతో మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని భక్తుల కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories