తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌
x
Highlights

తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభిస్తామని మే 12న...

తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభిస్తామని మే 12న టీటీడీ ఈవో రాసిన లేఖకు ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్‌ మంగళవారం ఉత్వర్వులు జారీచేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరిస్తూ శ్రీవారి దర్శనాన్ని కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యలో మార్చి 20 శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories