ఏపీ ఆర్థికంగా గట్టెక్కాలంటే 39,815 కోట్లు కావాలి!

ఏపీ ఆర్థికంగా గట్టెక్కాలంటే 39,815 కోట్లు కావాలి!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుత...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రికి వివరాలు అందచేశారు. నిధుల లభ్యత, ఖర్చులు, ఇతర అవసరాలు కలిపి చూసిన తరువాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.39,815 కోట్లు అవసరమవుతాయని వారు సీఎం కు వివరించారు. నాలుగు నెలల కాలానికి ఓటాన్ ఎకౌంట్ ను శాసనసభకు గతంలోనే అందచేశారు. నిజానికి అది నాలుగు నెలల కాలానికి బడ్జెట్ అయినా, సంవత్సర కాలానికి మొత్తం అంచనాను కూడా రూపొందించారు. దీని ప్రకారం ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2,26,178 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ రూపొందించారు. ఇందులో అన్ని ఖర్చులు, ఆదాయాలు లెక్కవేశారు. కానీ మారిన పరిస్థితుల నేపధ్యంలో ఎక్కడ ఖర్చు పెరుగుతుంది.. ఎక్కడ ఆదాయం తగ్గుతుంది వంటి వివరాలను మదింపు చేసి ఇంకా అదనంగా రూ.39,815 కోట్లు అవసరమవుతాయని అధికారులు లేక్కలేశారు.

వారి లెక్కల ప్రకారం ఆదాయంలో రూ.26,278 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కొత్త పథకాల అమలుకు రూ.6,265 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు.

అధికారులు వేసిన తాహా లెక్కలిలా ఉన్నాయి...

ప్రతిపాదిత బడ్జెట్.....2,26,178 కోట్లు

కచ్చితమైన ఖర్చులు.....1,47,870 కోట్లు

ఇతర బడ్జెట్ ఖర్చులు ..78,307 కోట్లు

తాజాగా అదనంగా తేల్చిన ఖర్చులు .. 12,615 కోట్లు

మొత్తం తాజా అంచనా ఖర్చు .. 2,38,793 కోట్లు

ముందు వేసిన అంచనా ఆదాయం .. 2,25,705 కోట్లు

ప్రస్తుత ఆదాయం లోటు అంచనా.. 26,728 కోట్లు

ఆదాయంపై తాజా అంచనా ... 1,98,977 కోట్లు

అదనంగా కావాల్సిన మొత్తం.. 39,815 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories