మెరుగైన విద్యా ప్రమాణాలు కోసం ఎలాంటి చర్యలు కైనా సిద్దం ; ఆదిమూలపు సురేష్

మెరుగైన విద్యా ప్రమాణాలు కోసం ఎలాంటి చర్యలు కైనా సిద్దం ; ఆదిమూలపు సురేష్
x
Highlights

వెలగపూడి: జులై 26 రాష్ట్రం లో విద్యా ప్రమాణాలు మెరుగుకు ఏ విధమైన చర్యలు తీసుకునేందుకయినా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు...

వెలగపూడి: జులై 26 రాష్ట్రం లో విద్యా ప్రమాణాలు మెరుగుకు ఏ విధమైన చర్యలు తీసుకునేందుకయినా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రం లో నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన సహకారం అందించేందుకు ఆస్ట్రేలియన్ కౌన్సిల్ బృందం శుక్రవారం సచివాలయం లో మంత్రి సురేష్ తో సమావేశమయ్యారు. వారితో మాట్లాడిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి పలు దేశాలు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. అందులో భాగంగా ఆస్ట్రేలియన్ కౌన్సిల్ బృందం రాష్ట్రానికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చారన్నారు.

రాబోయే రోజుల్లో సిఎం ఆలోచన మేరకు రాష్ట్రం లోని విశ్వ విద్యాలయాలను దేశంలోనే ప్రాచుర్యం పొందే విదంగా తీర్చి దిద్దుతామన్నారు. ఆస్ట్రేలియన్ సభ్యులతో కూడా చర్చలు జరిపి వారి నుంచి సహకారం తీసుకుని విద్యాలయాల వసతులు, నాణ్యతా ప్రమాణాల మెరుగు తదితర అంశాలపై ద్రుష్టి సారిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియన్ ట్రేడ్ కమిషనర్ మునీష్ శర్మ, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఆసియా పీటర్ బాల్డ్విన్, గితేష్ అగర్వాల్ , మైఖెల్ వాదే తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories