ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
x
Highlights

ఏపీలో ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి విద్యార్థులు కళాశాలలకు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ర్యాంకుల వారీగా...

ఏపీలో ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి విద్యార్థులు కళాశాలలకు ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ర్యాంకుల వారీగా ఆప్షన్ల ఎంపికకు ఉన్నత విద్యా మండలి తేదీలు ప్రకటించింది. 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30న.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్ట్‌ 1న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్ట్‌ 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించింది. అనంతరం ఆగస్ట్‌ 4న సీట్లు కేటాయించనున్నారు. ఆగస్ట్‌ 5 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టు చేసేందుకు చివరి తేదీ ఆగస్ట్‌ 8గా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో గత ఏడాది ఫీజులే వర్తిస్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories