Top
logo

పోలీస్‌ కుటుంబాలకు ఏపీ డీజీపీ బహిరంగ లేఖ.. నా మాట మన్నించి..

పోలీస్‌ కుటుంబాలకు ఏపీ డీజీపీ బహిరంగ లేఖ.. నా మాట మన్నించి..
Highlights

రాష్ట్ర పోలీస్ కుటుంబాలకు ఏపీ డీజీపీ గౌత‌మ్ సవాంగ్ బహిరంగ లేఖ రాశారు. పోలీస్ కుటుంబాలకు ఏమి ఇచ్చినా నేను రుణం...

రాష్ట్ర పోలీస్ కుటుంబాలకు ఏపీ డీజీపీ గౌత‌మ్ సవాంగ్ బహిరంగ లేఖ రాశారు. పోలీస్ కుటుంబాలకు ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను . 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వెల్ ఫేర్ డెస్క్ ఫర్ పోలీస్ ఫ్యామిలీస్ ను ఏర్పాటు చేస్తున్నాము. కరోనా నుంచి రాష్ట్రాన్ని రక్షించడమే మన పోలీసుల తక్షణ కర్తవ్యం అని తెలిపారు. పోలీస్ కుటుంబాలకు అభినందనలు తెలుపుతున్నాము . పోలీస్ కుటుంబాలు పరోక్షంగా చేస్తున్న త్యాగాలు మరువలేనివి. నా మాట మన్నించి కరోనా ప్రమాదకరం అని తెలిసినా , నీరు లేకున్నా , ఆహారం లేకున్నా రక్షకభటుడు అనే పేరును సార్దకం చేస్తున్నారు . పోలీసు కుటుంబాలు ఎంత మదన పడుతున్నాయో నేను ఊహించగలను. పోలీస్ భార్యలకు, పిల్లలకు ధన్యవాదాలు సోషల్ మీడియాలో పోలీస్ కుటుంబాలు చేస్తున్న ప్రచారం మరువలేనిది అని తెలిపారు.

Web Titleap dgp Gautam sawang write a letter to police family
Next Story