ఏపీ అప్పులు 2.49 లక్షల కోట్లు

ఏపీ అప్పులు 2.49 లక్షల కోట్లు
x
Highlights

రాష్ట్ర బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ ఆంధ్రప్రదేశ్‌పై రూ.2,49,435 కోట్ల రుణభారం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌...

రాష్ట్ర బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ ఆంధ్రప్రదేశ్‌పై రూ.2,49,435 కోట్ల రుణభారం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2015 మార్చి నెలాఖరు దాకా రాష్ట్రంపై రూ.1,48,743 కోట్ల అప్పులు ఉండగా... 2017 మార్చి నెలాఖరుకు ఇది రూ.2,01,314 కోట్లకు చేరిందని, ఈ కాలంలో 35శాతం అప్పులు పెరిగాయని వివరించారు. అలాగే, డిస్కమ్‌ల అప్పులను టేకోవర్‌ చేయడానికి వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి ఒకసారి అప్పులు తీసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతించామని, అందులో ఉదయ్‌ పథకం కింద 2016-17లో రూ.8256 కోట్ల అదనపు రుణం తీసుకోడానికి ఆంధ్రప్రదేశ్‌కు అనుమతించామని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories