logo

కులమత బేధాలు పోయి.. సంఘ సంస్కరణలు రావాలి: జగన్

కులమత బేధాలు పోయి.. సంఘ సంస్కరణలు రావాలి: జగన్
Highlights

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. మొదటిసారి సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఏపీ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 13 శాఖల శకటాల విన్యాసాలు ప్రజలను అలరించాయి. తరువాత స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం సీఎం జగన్ రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఎందరో సమరయోధుల త్యాగాల వల్లే నేడు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. సమాజంలో విభజించి పాలించు అనే ఆలోచనలు పోవాలన్నారు జగన్. కులమత బేధాలు పోయి.. సంఘ సంస్కరణలు రావాలన్నారు. దేశం, రాష్ట్రంలో దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయిందని.. వ్యవస్థ కూడా బాగా చెడిపోయిందన్నారు. ఈ వేడుకలకు వైఎస్ విజయమ్మ, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, కొందరు మంత్రులు, డీజీపీ సవాంగ్ హాజరయ్యారు.


లైవ్ టీవి


Share it
Top