కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ వైఖరిలో మార్పు లేదు: సీఎం జగన్

కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ వైఖరిలో మార్పు లేదు: సీఎం జగన్
x
Highlights

స్వార్థ రాజకీయాల కోసం కాపు రిజర్వేషన్ల అంశాన్ని వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అన్నారు. చంద్రబాబు తీసుకున్న చర్యల వల్ల...

స్వార్థ రాజకీయాల కోసం కాపు రిజర్వేషన్ల అంశాన్ని వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అన్నారు. చంద్రబాబు తీసుకున్న చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా...? ఓసీలా... అన్న పరిస్థితి తలెత్తిందన్నారు. వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రిని అసెంబ్లీ చాంబర్‌లో కలిశారు.

కాపు రిజర్వేషన్లపై జగన్ సమక్షంలో చర్చ జరిగింది. అసెంబ్లీ చాంబర్‌లో సీఎం జగన్‌ను కలిసిన వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు కాపు రిజర్వేషన్ల అంశంపై తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు జగన్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ్ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిశీలించాల్సిందిగా పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు సూచించారు.

చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడంపై, ఈబీసీల్లో ఇచ్చిన 5శాతం కోటాలపై న్యాయస్థానాల్లో కేసులున్నాయన్నారు జగన్. దీనిపై అడుగు ముందుకు వేస్తే ఈ కింద సీట్లు , ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. ఈబీసీల్లోల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసిందని... దానికి విరుద్ధంగా అడుగులు వేయగలమా అని ప్రశ్నించారు జగన్. ఈ బడ్జెట్‌లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించామని...కానీ చంద్రబాబు ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం 1,340 కోట్లేనని అన్నారు జగన్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories