Top
logo

15వ తేదీన సీఎం జగన్ అమెరికా పర్యటన

15వ తేదీన సీఎం జగన్ అమెరికా పర్యటన
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కుటుంబంతో కలిసి అమెరికా బయలుదేరి వెళుతున్నారు. మళ్లీ 24వ...

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కుటుంబంతో కలిసి అమెరికా బయలుదేరి వెళుతున్నారు. మళ్లీ 24వ తేదిన తిరుగుపయనం అవుతారు. అమెరికాలో జగన్ పర్యటన వారం రోజులు సాగనుంది. ఈసందర్భంగా ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికేందుకు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ నెల 17న డల్లాస్‌లోని ప్రసిద్ధ డల్లాస్ కనెవన్షన్ సెంటర్‌లో ప్రవాసాంధ్రులు భారీ స్థాయిలో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఇక అమెరికాలో తెలుగువారి కోసం పనిచేస్తున్న పలు సంఘాలు, సంస్థలతో పాటు అక్కడ చాలా కాలంగా స్థిరపడిన తెలుగువారు పెద్దసంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణంపై జగన్ పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

Next Story

లైవ్ టీవి


Share it