తొలిసారిగా సీఎం హోదాలో విజయనగరంకి సీఎం జగన్ .. కీలక పధకానికి ముహూర్తం

తొలిసారిగా సీఎం హోదాలో విజయనగరంకి సీఎం జగన్ .. కీలక పధకానికి ముహూర్తం
x
Jagan Mohan Reddy (File Photo)
Highlights

ఏపీ సీఎం జగన్ ఈ రోజు(సోమవారం) విజయనగరంలో పర్యటించనున్నారు... పర్యటనలో భాగంగా నవరత్నాల్లో ఒకటైనా 'జగనన్న వసతి దీవెన'

ఏపీ సీఎం జగన్ ఈ రోజు(సోమవారం) విజయనగరంలో పర్యటించనున్నారు... పర్యటనలో భాగంగా నవరత్నాల్లో ఒకటైనా 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం టూర్ షెడ్యూల్ ఫైనలైజ్ చేసింది. సీఎం జగన్ ఉదయం 9.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరి 11 గంటలకు విజయనగరంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చేరుకుంటారు. అనంతరం 11.25 గంటలకు 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించి అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12.25 నుంచి దిశ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. మధ్యాహ్నం 12.35కి పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.45కి దిశ పోలీస్ స్టేషన్‌ నుంచి అక్కడి పోలీస్ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్‌కి వెళ్తారు. అక్కడి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి... మధ్యాహ్నం 1 గంటకు విశాఖ నుంచి గన్నవరం బయల్దేరతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయనగరం నుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.

ఇక నవరత్నాల్లో ఒకటైనా జగనన్న వసతి దీవెన పధకం.. ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు భరోసాగా నిలుస్తోంది. ఈ పధకం కింద పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి, భోజన ఖర్చుల కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది.మొదట్లో ఉన్నత చదువులు చదువుతున్న వారికే వసతి దీవెన అమలుకు ప్రతిపాదించినప్పటికీ, తరువాత దీనిని ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories