logo

సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెనక ఎజెండా ఏంటి?

సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెనక ఎజెండా ఏంటి?
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేసి తెస్తామన్నారు. అదే గేమ్ ప్లాన్ గా రాజకీయ పోరాటం చేశారు. ఎన్నికల్లో గెలిచారు....

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేసి తెస్తామన్నారు. అదే గేమ్ ప్లాన్ గా రాజకీయ పోరాటం చేశారు. ఎన్నికల్లో గెలిచారు. తీరా చూస్తే వైసీపీ ప్లాన్ A ఘోరంగా విఫలమైంది. మరిప్పుడు ప్లాన్ B ఏంటి? వైసీపీ వ్యూహమేంటి? జగన్ ఢిల్లీ టూర్ వెనక ఎజెండా ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా సాధన ధ్యేయంగా ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో అయిదేళ్ల పాటూ హోరెత్తించిన వైసీపి ఇప్పుడు దాని సాధన దిశగా పోరు మొదలెడుతోంది. హోదా డిమాండ్ ను సజీవంగా ఉంచినది తామేనంటూ ప్రజల ముందు నిలబడి ఓట్లడిగిన వైసీపీ ఇప్పుడు పోరాట వ్యూహాన్ని మార్చేసింది.

దీక్షలు, ధర్నాలతో సాధించాలన్న ప్లాన్ A విఫలం కావడంతో వైసీపీ ఇప్పుడు ప్లాన్ B అమలు చేస్తోంది. జగన్ ఢిల్లీ టూర్ ఇదే ఎజెండాగా సాగుతోంది. నీతీ ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్ హోదాపై ఒక స్పష్టమైన వ్యూహంతో అడుగులేస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి వైసీపీ అంచనా వేసింది వేరు..కేంద్రంలో హంగ్ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందించడానికి హోదా ఇవ్వాలన్న కండిషన్ పెడతామని వైసీపీ మొదట్లో చెప్పింది. కానీ ఈ అంచనాలకు భిన్నంగా మోడీ బంపర్ మెజారిటీతో గెలిచారు. దాంతో ప్రస్తుతం కేంద్రాన్ని డిమాండ్ చేసే సీన్ లేదు బతిమాలుకుని, ఒప్పించి, మెప్పించి తెచ్చుకునే మార్గం మాత్రమే ఉంది.

గత పార్లమెంటు సమావేశాల చివరి రోజుల్లో వైసీపీ గేమ్ ప్లాన్ మార్చింది. హోదా డిమాండ్ తో పార్లమెంటు ఉభయ సభల్లోనూ గొడవ చేసింది. పార్లమెంటు ప్రాంగణంలో ప్లకార్డులతో నిలబడి తన పోరాటాన్ని ఉథృతం చేసింది. అది ఎంతలా అంటే అప్పటి వరకూ ప్యాకేజ్ తో సరి అన్న టిడీపీ కూడా వ్యూహం మార్చి దారికొచ్చేంతలా సీన్ మారిపోయింది. అందరికన్నా ముందే వైసీపీ ఎంపీలు రాజీనామాలు, 48 గంటల దీక్షలు కూడా చేసేశారు.. హోదా రేస్ లో తామే ముందున్నామని గర్వంగా ప్రకటించారు. తీరా ఫలితాలు రివర్స్ లో రావడంతో వైసీపీ హోదా సాధన కోసం రూటు మార్చాల్సి వచ్చింది. అందుకే పోరాట రూపాన్ని మార్చేసింది. దానికోసం మూడంచెల వ్యూహం అమలు చేస్తోంది. హోదా కోసం ఇక పోరాటం కాదు కేవలం ఒత్తిడే మార్గం కేంద్రాన్ని బతిమాలి, బామాలి హోదా సాధించాలనే ఉద్దేశంలో వైసీపీ నేతలున్నారు.

ఇక రెండో వ్యూహం నీతీ ఆయోగ్ లో కూడా ప్రధానంగా జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అందుకోసం నీతీ ఆయోగ్ లో మెంబర్ కూడా అయిన అమిత్ షాను ముందే కలసి రాష్ట్ర పరిస్థితిని కూలంకషంగా తెలియ చేసి హోదా డిమాండ్ ను ఆయన ముందుంచారు. మోడీకి నచ్చ చెప్పాల్సిందిగా కోరారు. ఇక శనివారం నాటి నీతీ ఆయోగ్ సమావేశంలో కూడా ఏపీ సీఎం ఎజెండా ఇదే సమావేశంలో ఏపీ పరిస్థితిని క్షుణ్ణంగా వివరించడం, హోదా అవసరాన్ని తెలియ చెప్పడమే లక్ష్యంగా జగన్ అడుగు లేస్తున్నారు. హోదా ఒక్కటే కాదు విభజన చట్టంలో పొందు పరచిన అంశాల అమలు, ఇరు రాష్ట్రాల మధ్యా ఆస్తులు, అప్పుల పంపకాల అంశం కూడా తేల్చాలని ఏపీ సీఎం అడగబోతున్నారు.

ఇక మూడో వ్యూహం ఏపీ ఎంపీలతో పార్లమెంటులో హోదా కోసం ఒత్తిడి పెంచడం 22 మంది ఎంపీలతో మూడో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ముద్రపడిన వైసీపీ పార్లమెంటులోనూ హోదా అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించింది. వైసీపీ పార్లమెంటరీబోర్డు సమావేశంలో ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం ఇదే మొత్తం మీద హోదా సాధన కోసం వైసీపీ తన గేమ్ ప్లాన్ మొదలు పెట్టింది.లైవ్ టీవి


Share it
Top