ఇక ఇంటికే ఇసుక..

ఇక ఇంటికే ఇసుక..
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. మాఫియాను అరికట్టేలా కొత్త మైనింగ్ విధానానికి ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం కారుచౌకగా...

ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. మాఫియాను అరికట్టేలా కొత్త మైనింగ్ విధానానికి ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం కారుచౌకగా ఇసుకను అందుబాటులోకి తెచ్చింది. టన్ను ఇసుక ధరను 375 రూపాయిలుగా నిర్ణయించిన జగన్ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు నేరుగా ఇంటికే ఇసుక సప్లై చేయనున్నట్లు ప్రకటించింది.

ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు ఇకపై నేరుగా ఇంటికే ఇసుక రానుంది. అదీ కూడా ఇంతకుముందు కంటే చీఫ్‌ అండ్ బెస్ట్‌ ప్రైస్‌కే ఇసుక లభించనుంది. ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త మైనింగ్ విధానానికి ఆమోదం తెలిపిన జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నేరుగా ఇంటికే ఇసుక సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.

నూతన ఇసుక పాలసీకి ఆమోదముద్ర వేసిన ఏపీ కేబినెట్‌ టన్ను ఇసుక ధరను 375 రూపాయిలుగా నిర్ణయించింది. ఇసుక మాఫియా, దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఇంటికే సరఫరా జరిగేలా రోడ్ మ్యాప్ ప్రకటించింది. ఇసుక కావాల్సినవాళ్లు ఇంట్లో కూర్చొని ఏపీఎండీసీ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు ఇంటికే ఇసుక సరఫరా సప్లై చేయనున్నారు.

ప్రస్తుతం 41 స్టాక్ యార్డుల్లో ఇసుక అందుబాటులో ఉందన్న మంత్రి పేర్ని నాని అక్టోబర్ నాటికి వాటిని 70కి పెంచుతామన్నారు. అలాగే, ఎలాంటి దోపిడీ, మాఫియాకి ఆస్కారం లేకుండా జీపీఎస్ అమర్చిన వాహనాల్లో ఇసుక సరఫరా చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories