logo

ఏపీ కేబినేట్‌ భేటీ.. పలు కీలక బిల్లుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

ఏపీ కేబినేట్‌ భేటీ.. పలు కీలక బిల్లుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
Highlights

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల ఆమోదం కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన...

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల ఆమోదం కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం 12 బిల్లుల‌ను ఈసారి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. టెండ‌ర్లలో పార‌ద‌ర్శక‌త కోసం జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటుతో పాటు ప్రవేట్ విద్యాసంస్థల్లో ఫీజ‌లు నియంత్రణ వంటి కీల‌క బిల్లుల‌కు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

ముఖ్యంగా జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటికీ చట్టబద్దత కల్పించేలా ప్రభుత్వం బిల్లులకు రూపకల్పన చేసింది. ఏపి ఇన్ ఫ్రాస్టక్చర్ డెవ‌ల‌ప్ మెంట్ ఎనేబ‌లింగ్ యాక్ట్ 2001కి స‌వ‌ర‌ణ‌ చేయనుంది. ఇదే బిల్లులో జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటును ప్ర‌స్తావించ‌నున్న ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌న బిల్లు అన్ని దేవాలయాల పాల‌క‌మండ‌ళ్ళ ర‌ద్దు నియామకాల కోసం దేవాదాయ శాఖ చ‌ట్టంలో మార్పులు చేయనుంది. అలాగే.. ప‌రిశ్ర‌మ‌ల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు క‌ల్పించేలా చ‌ట్టం రూప‌క‌ల్పన‌ టీటీడీ పాల‌క‌మండ‌లిని ఎప్పుడైనా రీకాల్ చేసేలా హిందూ ధార్మిక చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు తీసుకురానుంది. అలాగే లోకాయుక్త నియామ‌కానికి సంబంధించి హైకోర్ట్ రిటైర్డ్ చీఫ్ జ‌స్టిస్ ను నియ‌మించే స‌వ‌ర‌ణ‌కు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది.

విద్యుత్ నియంత్రణ మండ‌లి సిఫార్సుల అమ‌లు కోసం చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. ప్రయివేట్ కాలేజీలు, స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ‌, విద్యాసంస్థల నియంత్రణ మండ‌లి ఏర్పాటు చేస్తూ స‌వ‌ర‌ణ‌లు చేయ‌నుంది. అలాగే కౌలు రైతులకు అండగా ఉండేందుకు వీలుగా పంటపై 11 నెలల పాటు సాగు ఒప్పందం చేసుకునేందుకు వీలు కల్పించేలా మరొక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. మ‌రోవైపు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసేలా చట్టాన్ని తీసుకురానుంది. ఇక స‌మ‌గ్ర భూ స‌ర్వే నిర్వహించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది. అలాగే సీఆర్డీఏ అథారిటీ ఛైర్మన్‌గా సీఎంను కాకుండా మ‌రొక‌రికి అప్ప‌గించేలా కూడా చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేయ‌నుంది. మంత్రివర్గంలో ఈ బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత సభలో ప్రవేశపెట్టనుంది.


లైవ్ టీవి


Share it
Top