ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..!

ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..!
x
Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది....

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రమంతటా మొత్తం 11 వేలకు పైగా భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు

శాసన రాజధానిగా అమరావతి

ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా విశాఖ

జ్యూడిషియల్‌ కేపిటల్‌గా కర్నూలు

విశాఖకు సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు

అమరావతిలో మూడు అసెంబ్లీ సెషన్స్‌

మంత్రులు అమరావతి, విశాఖలో ఉండాలని నిర్ణయం

4 ప్రాంతీయ కమిషనరేట్ల ఏర్పాటుకు ఆమోదం

కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ

13 జిల్లాలను 25కు పెంచే ఆలోచనపై చర్చ

జిల్లాల విభజన తర్వాత సూపర్‌ కలెక్టర్ల వ్యవస్థ అమలు

హైపవర్‌ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

రాజధాని రైతులకు పరిహారంపై చర్చించిన కేబినెట్‌

రైతులకు ఇచ్చే కౌలును పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం

రూ.2,500 నుంచి రూ.5 వేలకు కౌలు పెంపు

10 నుంచి15 ఏళ్ల వరకు కౌలు ఇవ్వాలని నిర్ణయం

పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లుకు ఆమోదం

సీఆర్డీఏను అమరావతి మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్పు

11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories