Top
logo

బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన.. ఏ పథకానికి ఎన్ని నిధులంటే..

బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన.. ఏ పథకానికి ఎన్ని నిధులంటే..
X
Highlights

నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్‌ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల...

నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్‌ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. నవరత్నాల పథకాలతోపాటు వ్యవసాయం, నీటి పారుదల, పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులకు అత్యంత ప్రాధాన్యమిస్తామని చెప్పారు. రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. కాలయాపన లేకుండా మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

* రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ.200కోట్లు

* వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయం కింద రూ.100కోట్లు

* చేపల జెట్టీలు, హార్బర్ల కోసం రూ.100కోట్లు

* మత్స్యకారుల పడవలకు డీజిల్‌ రాయితీ కింద రూ.100కోట్లు

* మత్స్య సంపద అభివృద్ధి కోసం రూ.60కోట్లు

* ఎస్సీ మత్స్యకారుల సంక్షేమానికి రూ.50కోట్లు

* 108 వైద్య సేవల కోసం రూ.143.38కోట్లు

* 104 వైద్య సేవల కోసం రూ.179.76కోట్లు

* ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకీకరణకు రూ.1500కోట్లు

* కొత్తగా మూడు వైద్య కళాశాలల కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు

* పాడేరు, గురజాల, విజయనగరంలో వైద్య కళాశాలలకు రూ.66కోట్లు చొప్పున కేటాయింపు

* పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కోసం రూ.50కోట్లు

* క్రీడలు, యువజన సర్వీసులకు రూ.329.68కోట్లు

* సాంకేతిక విద్యకు రూ.580.29కోట్లు

* కళలు, సాంస్కృతికానికి రూ.77.67కోట్లు

* రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.100కోట్లు

* వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.100.05కోట్లు

* పాల సహకార సంఘాల అభివృద్ధికి రూ.100కోట్లు

* గిడ్డంగుల నిర్మాణానికి రూ.37.53కోట్లు

* గిడ్డంగులు, మౌలిక నిధి కింద రూ.200కోట్లు

* వైఎస్‌ఆర్‌ వ్యవసాయ ప్రయోగశాల కోసం రూ.109.28కోట్లు

* ఇంధన శాఖకు రూ.6,861.03కోట్లు.

* రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం రూ.92,050.05కోట్లు

* ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,000కోట్లు

* ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4988.52కోట్లు

* బీసీ సబ్‌ ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.15,061.64కోట్లు

* ఆర్థిక రంగ సేవల కోసం రూ.86,105.63కోట్లు

* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677.08కోట్లు

* గ్రామీణాభివృద్ధికి రూ.29,329.98కోట్లు

* జలవనరుల కోసం రూ.13,139.05కోట్లు

* తాగునీరు, వరద నియంత్రణ కింద రూ.13,139.05కోట్లు

* విద్యుత్‌శాఖకు రూ.6,861.03కోట్లు

* ఖనిజాభివృద్ధి శాఖకు రూ.3,986.05కోట్లు

Next Story