రణరంగంగా మారిన ఏపీ అసెంబ్లీ..చెవిరెడ్డి వ్యాఖ్యలపై సభలో దుమారం

రణరంగంగా మారిన ఏపీ అసెంబ్లీ..చెవిరెడ్డి వ్యాఖ్యలపై సభలో దుమారం
x
Highlights

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరు పక్షాలు ఒకదానిపై ఒకటి మండిపడ్డాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో చెవిరెడ్డి వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. స్పీకర్‌ను చైర్ వద్దకు తీసుకువెళ్లె విషయంలో రాద్ధాంతం మొదలైంది. స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టడానికి చంద్రబాబు తన బంట్రోతును పంపారని చెవిరెడ్డి అనడంతో సభలో గందరగోళం నెలకొంది.

అయితే చెవిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడుని చెవిరెడ్డి బంట్రోతు అనడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం కూడా పంపలేదన్నారు చంద్రబాబు. తాము ఎమ్మెల్యేలమో బంట్రోతులమో తేల్చాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తాము చంద్రబాబు బంట్రోతులైతే మీరు జగన్ బంట్రోతులా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడిపై అధికార పక్ష ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సభా సంప్రదాయాలను గౌరవించకుండా చంద్రబాబు అచ్చెన్నాయుడుని పంపారని ఆరోపించారు. అచ్చెన్నాయుడిని కేవలం బంట్రోతులాగా అన్నారని చెప్పుకొచ్చారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం పలికినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు సీఎం జగన్. అవసరమైతే ఆహ్వానం పలికిన విషయాన్ని ప్లే చేస్తామన్నారు. చంద్రబాబు చేసిన తప్పునకు క్షేమాపణ చెప్పాలన్నారు జగన్.

స్పీకర్‌ను అవమానించడం చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య అని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గతంలోలా ఇప్పుడు కూడా స్పీకర్‌ను చంద్రబాబు అగౌరవపరుస్తున్నారని అన్నారు. చెవిరెడ్డి వ్యాఖ్యల విషయంలో టీడీపీ రాద్ధాంతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు అంబటి రాంబాబు. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తాము క్షేమాపణ చెప్పాలని పదే పదే అంటున్నారని అయితే తాము ఎంతమంది ఉన్నామో గుర్తించాలన్నారు అంబటి రాంబాబు. అయితే తన వ్యాఖ్యలపై చెవిరెడ్డి వివరణ ఇచ్చారు. బంట్రోతు అన్నందుకు తాను క్షేమాపణ చెబుతానని చెవిరెడ్డి తెలిపారు. అయితే అంతకు ముందుచనిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నరరూప రాక్షసుడు అన్నందుకు చంద్రబాబు క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories